హత్యా? ఆత్మహత్యా?... ప్రేమ జంట మృతిపై అనుమానాలు
- చనిపోక ముందు ఓ పెళ్లికి హాజరైన జంట
- తిరుగు ప్రయాణంలో ఘటన
- చంపి పట్టాలపై పడేసి ఉంటారన్న అనుమానం
స్నేహితుడి పెళ్లి ఉందని తండ్రికి చెప్పి శ్రవణ్ కారు తీసుకురాగా, స్నేహితురాలి పెళ్లి ఉందని మయూరి ఇంట్లో చెప్పి శ్రవణ్‌తో కలిసి కారులో బయలుదేరింది. పెళ్లి పూర్తయ్యాక తిరిగి నందిగామకు బయలుదేరిన వీరు కొద్దిసేపటికే చనిపోవడం, పట్టాల పక్కన కారు నిలిపి ఉండడంపై అనుమానం వ్యక్తమవుతోంది.
పైగా రైలు ఢీకొట్టి చనిపోతే శరీర భాగాలు తునాతునకలవుతాయని, పట్టాల మధ్యన పడుకోబెట్టినట్లు వీరిద్దరి శవాలు దగ్గరదగ్గరగా పడివుండడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చంపేసి పట్టాలపై పడేసి ఉంటారని, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని స్థానికులు చెబుతున్నారు.