India: ఇడ్లీ చరిత్ర మొదలైంది మనదేశంలో కాదట!

  • మొదట ఇండోనేసియాలో ఇడ్లీల తయారీ
  • ఆద్యులు మాత్రం హిందూ రాజులే!
  • వెల్లడించిన ప్రఖ్యాత ఫుడ్ హిస్టోరియన్

ఇడ్లీ అంటే తేలిగ్గా అరిగే ఆహారం అని ఎవరైనా అంగీకరిస్తారు. రోగులకు డాక్టర్లు సూచించే అల్పాహారాల్లో ఇడ్లీ అత్యంత ప్రధానమైనది. పూర్తిగా నూనె లేకుండా తయారయ్యే వంటకం కావడంతో ఇది ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు సృష్టించదని నమ్ముతారు. దానికితోడు చవకగా లభించే అల్పాహారం కూడా కావడంతో దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

 అయితే, ఇడ్లీ అనేది దక్షిణాది వంటకం అని, ముఖ్యంగా తమిళనాడు సంప్రదాయ వంటకం అని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. కానీ, ఇడ్లీ అనేది దక్షిణాది వంటకం కాదని, అసలు మనదేశానికి చెందినది కాదని అంటున్నారు ప్రఖ్యాత ఫుడ్ హిస్టోరియన్ కేటీ ఆచార్య. ఇడ్లీ వంటకం ఇండోనేషియాలో పుట్టిందని, ఆ దేశాన్ని పరిపాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాల తయారీలో భాగంగా ఇడ్లీకి రూపకల్పన చేశారని ఆచార్య వివరించారు.

800 నుంచి 1200 సంవత్సరాల మధ్యలో ఇడ్లీ భారతదేశంలో ప్రవేశించిందని, మొదట కర్ణాటకలో ప్రాచుర్యం పొందిందని వివరించారు. ఆనాడు వాటిని ఇడ్డలిగే అని పిలిచేవారని తెలిపారు. అయితే, ఇడ్లీల పుట్టుపూర్వోత్తరాల గురించి మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. కొందరు అరబ్ వ్యాపారులు ఇడ్లీలను భారతీయులకు పరిచయం చేశారని ఈజిప్ట్ గ్రంథాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. అరబ్ వ్యాపారులు దక్షిణ భారతదేశానికి చెందిన స్త్రీలను పెళ్లాడడం వల్ల ఇడ్లీలు దక్షిణాదిలో అడుగుపెట్టాయని కైరోలోని అల్ అజహర్ విశ్వవిద్యాలయంలో ఉన్న పత్రాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News