Andhra Pradesh: చంద్రబాబు పాలనలో ‘నారా వారి సారా స్రవంతి’ నడుస్తోంది: వైఎస్ జగన్
- ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలవుతోందా?
- ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల సంఖ్య పెరిగిపోయింది
- జన్మభూమి మాఫియా కమిటీలు ఏర్పాటు చేశారు
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, కేవలం రెండు రూపాయలకే మంచి నీరిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ హామీని ఈ ఐదేళ్ల పాలనలో నెరవేర్చలేదని విమర్శించారు. అనంతపురం జిల్లాలోని మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం’ అమలు కాకపోగా, ‘నారా వారి సారా స్రవంతి’ నడుస్తోందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో జరిగిందేమిటంటే, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల సంఖ్య పెరిగిపోయిందని, వీధివీధినా రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయని విమర్శించారు. జన్మభూమి మాఫియా కమిటీలను ఏర్పాటు చేశారని, పొదుపు సంఘాలు బలహీనమయ్యాయని విమర్శించారు.