: సింహాచల క్షేత్రంలో ఆగిన కోడెదూడల స్వీకరణ


సింహాచల క్షేత్రంలో అప్పన్నకు భక్తులు కానుకగా సమర్పించుకున్న కోడెదూడల సంరక్షణకు చర్యలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల వ్యవధిలో 150 వరకూ కోడెదూడలు అనారోగ్యంతో మృత్యువాత పడడం, దీనిపై గగ్గోలు రేగడంతో దేవస్థానం ఈవోలో చలనం వచ్చింది. గోశాల నుంచి 350 గోవులను క్రిష్ణాపురంకు తరలించారు. అక్కడ వాటికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనున్నారు.

మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో భక్తుల నుంచి కోడెదూడలను స్వీకరించడాన్ని అధికారులు నిలిపివేశారు. దీనికి బదులుగా ఇతర కానుకలు సమర్పించాలని సూచనలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News