చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం.. జగన్ గెలిస్తే ఇడుపులపాయకు రాజధాని!: సీపీఐ నేత కె.రామకృష్ణ
- ఏపీలో జనసేన-సీపీఐ కూటమి అధికారంలోకి వస్తుంది
- అవినీతి రహిత పాలన మా కూటమితోనే సాధ్యం
- గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు
ఏపీలో టీడీపీ, వైసీపీలు దొందూదొందేనని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు లోక్ సభ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతిరహిత పాలన జనసేన-వామపక్షాల కూటమితోనే సాధ్యమన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.