jagan: ఐదేళ్లు పని చేయకుండా ఇప్పుడు బిర్యానీ పెడుతున్నారు: జగన్ సెటైర్
- టీడీపీ పాలనలో రైతులు చాలా నష్టపోయారు
- ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి యువత భవిష్యత్తును నాశనం చేశారు
- వైసీపీ అధికారంలోకి వస్తే.. పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తాం
టీడీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. రైతు రుణమాఫీ జరగక, గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు సరైన పాలని చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు చివరి మూడు నెలల్లో బిర్యానీ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే పొదుపు సంఘాలకు వడ్డీలు లేని రుణాలను ఇస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రచారసభలో ప్రసంగిస్తూ, జగన్ పైవ్యాఖ్యలు చేశారు.