: ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడి
కేంద్రంలో మంత్రుల రాజీనామాల నేపధ్యంలో అవినీతి ఆరోపణలున్న మంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో మంత్రుల నివాస ప్రాంగణం ముట్టడికి బీజేఎంవై కార్యకర్తలు ప్రయత్నించారు. కళంకిత మంత్రులు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.