చంద్రబాబు తన అత్తగారి సొత్తంటూ పేదల భూములు లాగేస్తాడు జాగ్రత్త!: వైఎస్ జగన్
- పాయకరావుపేటలో జగన్ ఎన్నికల ప్రచారం
- ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు ఏమీ మిగల నివ్వడు
- ప్రజలు ఏం చేయాలో ‘జన్మభూమి’ కమిటీలే నిర్ణయిస్తాయి!
రైతులకు పూర్తిగా సున్న వడ్డీ రుణాలు ఎగ్గొడతాడని, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తాడని, పేదోడికి ఇల్లు ఇచ్చే విషయాన్ని మర్చిపోతాడని విమర్శించారు. చంద్రబాబు తనను వ్యతిరేకించేవారు సహా ఎవరినీ బతకనివ్వడని, సీబీఐ, ఈడీ లను రాష్ట్రంలోకి రానివ్వరని, చంద్రబాబు ఏ నేరాలు చేసినా పత్రికల్లో వార్తలుండవంటూ బాబుకు వత్తాసు పలికే ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు.