నేటి మధ్యాహ్నంతో ముగియనున్న తొలి దశ నామినేషన్ల పర్వం.. తెలంగాణలో ఇప్పటి వరకు 220 దాఖలు!
- రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన
- 28న మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణ గడువు
- గడువు ముగిసిన అనంతరం అభ్యర్థుల ప్రకటన
మంగళవారం నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. 28వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా, అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణ గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.