Telugudesam: నడవలేని స్థితిలో స్ట్రెచర్ పై వచ్చి నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి

  • కాల్పుల్లో గాయపడిన తిక్కారెడ్డి
  • వేలాదిమంది వెంటరాగా నామినేషన్ దాఖలు
  • మంత్రాలయం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ

మంత్రాలయం శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ నేత తిక్కారెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంబులెన్స్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన ఆయన స్ట్రెచర్ పై లోపలికి ప్రవేశించి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి తిక్కారెడ్డి అనుచరులు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో రోడ్లన్నీ నిండిపోయాయి.

 ఇటీవలే ఖగ్గల్లులో గన్ మన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డి కాలికి గాయం అయింది. అప్పటినుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఖగ్గల్లులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో గన్ మన్ కాల్పులు జరపడంతో తిక్కారెడ్డి కాలులోకి బుల్లెట్ దిగింది. అధిక రక్తస్రావం కావడంతో ఆయనను ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించడం జరిగింది. నామినేషన్లకు గడువు ముగుస్తుండడంతో అంబులెన్స్ లోనే మంత్రాలయం చేరుకున్న తిక్కారెడ్డి భారీగా అభిమాన జనం వెంటరాగా నామినేషన్ దాఖలు చేసి ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News