Andhra Pradesh: నేడు ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి ఎన్నికలు

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోలింగ్
  • బరిలో 94 మంది అభ్యర్థులు
  • ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్

ఓవైపు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగానే, ఈ సందట్లో ఏపీలో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు ఇవాళ నిర్వహించనున్నారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 5,62,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు ఎన్నికల్లో మొత్తం 94 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్ కోసం 123 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 26న ఉంటుంది.

  • Loading...

More Telugu News