Hyderabad: ఇథియోపియాలో దారుణం... హైదరాబాద్ వాసి సజీవ దహనం
- మరో నలుగురు మృతి
- నిప్పంటించిన దుండగులు
- కాలిబూడిదైన కారు
ఆఫ్రికా దేశం ఇథియోపియాలో దారుణం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. రహదారిపై ప్రయాణిస్తున్న కారును ఆపిన గుర్తుతెలియని దుండగులు ఆ కారుకు నిప్పంటించారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అందులో ఉన్న వ్యక్తులు తప్పించుకునే వీల్లేక కాలిబూడిదయ్యారు. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. మృతుడిని ముషీరాబాద్ పరిధిలోని అశోక్ నగర్ కు చెందిన పావని వెంకట శశిధర్ గా గుర్తించారు. మిగతా నలుగురు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.