: వలసపక్షులకు ముప్పు తెస్తున్న సెల్‌ టవర్లు


మొన్నటికి మొన్న కర్ణాటకకు ఏటా శోభను తెచ్చే వలప పక్షులు రెండు వారాల ముందుగానే ఆ రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని కూడా వార్తలొచ్చాయి. అయితే.. భారతదేశపు ప్రకృతి అందాలకు ప్రత్యేక వన్నెచిన్నెలు అద్దుతూ ఏటా ఒకసారి మన దేశాన్ని విజిట్‌ చేస్తూ.. పర్యాటక సొబగులు దిద్దే వలసపక్షులకు మన ఊర్లలో విచ్చలవిడిగా ఉంటున్న సెలఫోన్‌ టవర్ల వలన చాలా ప్రమాదం పొంచి ఉన్నదట.

ఈ సెలఫోన్‌ టవర్లనుంచి వెలువడే రేడియేషన్‌ తో పక్షులు చనిపోతున్నాయని, మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్న సమయంలోనే... ఈ వివరాలు కూడా వెలుగుచూడడం గమనార్హం. వలసపక్షులు తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే మార్గాన్ని ఆ దిశ, దిక్కులను సెలఫోన్‌ టవర్ల రేడియేషన్‌ ప్రభావం వల్ల గుర్తించలేని స్థితికి చేరుకుంటున్నాయిట. అందుకే కొన్ని సంవత్సరాలుగా మన దేశానికి వస్తున్న వలసపక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదంటూ.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పక్షుల మెదడులోని సెల్స్‌ ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య వాటి మార్గాన్ని గుర్తించేందుకు ఉపకరిస్తాయని... అందువల్ల తమ తమ స్వస్థలాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు అవి మనదేశానికి తరలి వస్తుంటాయని .. చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌గా పనిచేసిన రాంలఖన్‌ సింగ్‌ అంటున్నారు. భారత్‌ కూడా భాగస్వామిగా ఉన్న పక్షుల కన్వెన్షన్‌ ప్రకారం.. 160 జాతులకు చెందిన పక్షులను వేటాడ్డానికి వీల్లేదు. అయితే పట్టణ మరియు పల్లెప్రాంతాల్లో కూడా పెరుగుతున్న మొబైల్‌ టవర్ల సంఖ్య.. ఈ వలసపక్షుల ప్రాణానికే ముప్పు తెస్తోందని విహంగ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News