విజయవాడ పశ్చిమలో వైసీపీ కీలక నేత రాజీనామా!
- జగన్ను కలిసేందుకు 20 సార్లు ప్రయత్నించాం
- అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు
- ముస్లింలకు సీటు కేటాయిస్తామని మోసం చేశారు
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం బాధాకరమన్నారు. పార్టీ బలోపేతానికి విజయవాడ పశ్చిమలో ముస్లింలు ఎంతగానో శ్రమించారని, 9 జిల్లాల్లో మైనారిటీలకు ఒకే ఒక్క స్థానాన్ని కేటాయించడం చూస్తుంటేనే వైసీపీలో మైనారిటీలకు స్థానం లేదని అర్థమవుతోందని బేగ్ పేర్కొన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.