అన్న బాటలోనే తమ్ముడు...రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న పవన్‌కల్యాణ్
- ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చిన జన సేనాని
- ఎక్కడి నుంచి అన్నది పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడి
- గతంలో చిరంజీవి కూడా తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ
గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. సొంత జిల్లాలోని పాలకొల్లుతో పాటు తిరుపతి నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. అయితే తిరుపతిలో గెలిచినా పాలకొల్లులో ఓడిపోయారు. పవన్‌కల్యాణ్ కూడా చిరంజీవి బాటనే ఎన్నుకున్నట్లు అయింది. అయితే ఆయన గాజువాకతోపాటు పాలకొల్లు నుంచి పోటీ చేస్తారా? లేక మరేవైనా రెండు నియోజకవర్గాలు ఎన్నుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.