బాలయ్య చిన్నల్లుడి టికెట్ విషయం సీఎంతో చెప్పిన గంటా
- వైజాగ్ ఎంపీ స్థానంపై శ్రీభరత్ ఆసక్తి
- బలపరుస్తున్న స్థానిక నేతలు
- చంద్రబాబుతో చర్చించిన గంటా
విశాఖ లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై విశాఖ జిల్లా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, పంచకర్ల రమేష్ బాబు, గణబాబు తదితరులు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అందరూ శ్రీభరత్ కు టికెట్ ఇచ్చే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీభరత్ విశాఖ లోక్ సభ స్థానంపై పోటీకి ఆసక్తిగా ఉన్న విషయం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియజేశామని అన్నారు. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రంలోగా చంద్రబాబు వైజాగ్ టికెట్ విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయని అన్నారు.