తొలి దశ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. 21, 24 తేదీల్లో నామినేషన్లు బంద్
- నేటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ
- 26న పరిశీలన..27, 28 తేదీల్లో ఉపసంహరణ
- ఏప్రిల్ 11న పోలింగ్.. మే 23న ఫలితాలు
రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. 1,85, 560 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా, 94, 991 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. 41,356 వీవీపాట్ యంత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల కోసం ఏకంగా 270 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు.
ఇక, ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం.. 2.95 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు లేని వారు నమోదు చేసుకునే అవకాశం ఇక లేదు. ఈ నెల 15తోనే అది ముగిసింది. తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.