లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో బయోడేటాలు స్వీకరించనున్న ‘జనసేన’
- రేపటి నుంచి ప్రారంభం
- మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో సమర్పించాలి
- 3 రోజుల పాటు బయోడేటాలు స్వీకరిస్తాం: జనసేన పార్టీ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని లోక్ సభ స్థానాల నుంచి జనసేన పక్షాన బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించినట్టు తెలిపింది. ఈ కమిటీ సభ్యులుగా నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ ఉన్నట్టు వివరించింది. జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు, పార్టీ విధానాలపై విశ్వాసం ఉన్న సేవాతత్పరులు, జన సైనికులు తమ బయోడేటాలను ఈ కమిటీకి సమర్పించాలని కోరింది.