: కన్నడనాట బీజేపీ సభాపక్షనేతగా షెట్టర్


ఇటీవలే ముగిసిన కర్ణాటక ఎన్నికల్లో పరాజయం పాలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగదీశ్ షెట్టర్ బీజేపీ విధానసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ కు అధికారం కోల్పోయిన బీజేపీ.. మొన్నటి ఎన్నికల్లో షెట్టర్ ను మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసింది. కన్నడనాట బాగా ప్రాబల్య కులం అయిన లింగాయత్ ల ఓట్లను కొల్లగొట్టేందుకు వేసిన ఈ ప్రణాళిక.. యడ్యూరప్ప కారణంగా తుస్సుమంది. ఎందుకంటే, యడ్యూరప్ప కూడా లింగాయత్ వర్గానికే చెందినవాడు కావడంతో, ఓట్లలో భారీగా చీలిక ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

  • Loading...

More Telugu News