Chandrababu: తన వియ్యంకుడు బాలకృష్ణ డైలాగ్ చెప్పి విలేకరులను నవ్వించిన చంద్రబాబు
- ప్రెస్ మీట్ ముందు సీఎం ఛలోక్తులు
- కాలం లేదు మిత్రమా అంటూ కామెడీ
- పడీపడీ నవ్విన మీడియా ప్రతినిధులు
రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశానికి ముందు సీఎం చంద్రబాబు ఎంతో సరదాగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులు కొందరు సకాలంలో ప్రెస్ మీట్ కు రాకపోవడంతో వారికోసం వేచిచూశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక ఉపోద్ఘాతాలు లేవు బుల్లెట్ లా దూసుకుపోవడమే అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఎంతో పాప్యులర్ అయిన "సమయం లేదు మిత్రమా" అనే బాలకృష్ణ డైలాగ్ ను తనదైన శైలిలో "కాలం లేదు మిత్రమా" అంటూ మీడియా మిత్రుల ఆలస్యానికి అన్వయించారు టీడీపీ అధినేత. ఆ తర్వాత అందరూ వచ్చేశారా, ఇక ముందు మాటలు అక్కర్లేదు, దూసుకుపోవడమే అంటూ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, సినీ భాషలో 'మీరు టేక్ రెడీ అంటేనే మేం మాట్లాడతాం' అంటూ విలేకరులతో చమత్కరించారు. వారు చెప్పిన దానికి 'ఓకే అగ్రీడ్' అంటూ తనదైన శైలిలో మందహాసం చేశారు చంద్రబాబు.