Jagan: జగన్ ఓటు తొలగించాలంటూ పులివెందులలో ఫారం-7 దాఖలు చేసిన గుర్తు తెలియని వ్యక్తి

  • జగన్ బంధువుల ఆగ్రహం
  • అధికారులకు ఫిర్యాదు
  • విచారణ మొదలుపెట్టిన ఆర్వో

ఏపీ రాజకీయాలు ఎటు దారితీస్తున్నాయో అర్థంకాని స్థితిలో సగటు ఓటరు ఉన్నాడంటే అతిశయోక్తి కాదు! గతంలో పెద్దగా ప్రాచుర్యం పొందని ఫారం-7 ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా, పులివెందులలో వైసీపీ అధినేత జగన్ పేరిట ఉన్న ఓటు తొలగించాలంటూ ఫారం-7 దాఖలైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ దరఖాస్తు సంచలనం సృష్టిస్తోంది. దీనిపై జగన్ బంధువులు పులివెందుల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు నేపథ్యంలో విచారణ కోసం ఆర్వో రంగంలోకి దిగారు. అంతేకాకుండా, పులివెందుల పోలీస్ స్టేషన్ లో కూడా దీనిపై కేసు నమోదైనట్టు సమాచారం. ఇప్పటికే ఫారం-7 పేరుతో లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపించుకుంటున్న నేపథ్యంలో జగన్ ఓటుకే ఎసరు పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఇతర పార్టీల వారు ఆసక్తిచూపిస్తున్నారు.

  • Loading...

More Telugu News