Telugudesam: టీడీపీకి గుడ్ బై చెప్పిన తోట నర్సింహం.. రేపు వైసీపీలో చేరిక

  • టీడీపీ కోసం చాలా కష్టపడ్డాను
  • పార్టీ నన్ను గుర్తించలేదు
  • కాకినాడ ఎంపీ ఆవేదన

కాకినాడ ఎంపీ తోట నర్సింహం తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకున్నారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న నర్సింహం పార్టీని వీడుతారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఈ ఎంపీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన బుధవారం వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. తోట కుటుంబ సభ్యులు కూడా జగన్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో తోట నర్సింహం మాట్లాడుతూ, టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ పార్టీ తన శ్రమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్షలో పాల్గొన్న సమయంలో అనారోగ్యానికి గురయ్యానని, అందుకే తన భార్య వాణిని పెద్దాపురం నుంచి పోటీ చేయిస్తున్నానని తెలిపారు.

వైసీపీ నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, వైసీపీ నేతలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారని వెల్లడించారు. కార్యకర్తలతో అన్ని విషయాలు చర్చించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నాకే టీడీపీని వీడుతున్నానని స్పష్టం చేశారు. కాగా, తోట నర్సింహం భార్య వాణి పెద్దాపురం టికెట్ కోరుకుంటున్నారు. ఈ దిశగా జగన్ నుంచి హామీ రావడంతోనే తోట నర్సింహం టీడీపీకి గుడ్ బై చెబుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News