సీఆర్పీఎఫ్ అమర జవాన్లకు క్రికెటర్ల నివాళి.. ఆర్మీ టోపీలతో మైదానంలోకి భారత ఆటగాళ్లు!
- టోపీలను అందజేసిన ధోని
- నేడు రాంచీలో మూడో వన్డే
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
ఈరోజు ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు ఆర్మీ సిబ్బంది ధరించే టోపీలతో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లకు అందజేశారు. ఈరోజు మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.