: భారతీయులకు ఇంగ్లండ్ సూపర్ ప్రయారిటీ వీసాలు


బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల కోసం సూపర్ ప్రయారిటీ వీసాల మంజూరు సేవలను ప్రారంభించింది. ఈ సేవల్లో భారత్ నుంచి అత్యవసర పనులమీద ఇంగ్లాండ్ వెళ్ళే ప్రయాణికులకు వీసా అదే రోజు మంజూరు చేస్తారు. ప్రపంచంలోనే తొలిసారి యూకే ఈ తరహా సర్వీసులను ప్రారంభించింది. ఫిబ్రవరిలో డేవిడ్ కేమరూన్ భారత పర్యటన సందర్భంగా ఈ రకమైన వీసాల మంజూరుపై హామీ ఇచ్చారు. తొలిసారిగా భారతీయులకు ఈ సేవలు అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని ఇండియాలో బ్రిటిష్ హైకమీషనర్ సర్ జేమ్స్ బేవాన్ తెలిపారు. వ్యాపారస్తులకు ఈ వీసా ఎంతో ఉపయోగకరమని తెలిపిన బేవాన్ దరఖాస్తు ఆన్ లైన్ లో నింపి ఉదయం 9:30 గంటలలోపు వాటిని సబ్ మిట్ చెయ్యాలని సూచించారు.

  • Loading...

More Telugu News