ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
- మడకశిర నుంచి అశ్వద్ధ నారాయణ
- వెల్లడించిన రఘువీరారెడ్డి
- నెలాఖరులోగా అందరి పేర్ల ప్రకటన
నారాయణ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఏపీ విడిపోయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు ప్రచారంతో ఆ పార్టీ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా అన్ని అసెంబ్లీలకూ అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా రఘువీరారెడ్డి వెల్లడించారు.