: ఇరాన్ అధ్యక్షుడికి కొరడా దెబ్బల శిక్ష?
కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అదే సమయంలో శిక్షలూ విభిన్నంగా ఉంటాయి. సామాన్యుడైనా, దేశాధీశుడైనా అక్కడ ఒక్కటే. ఇరాన్ లోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించాడంటూ ఆ దేశ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ పై ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నెజాద్ చేసిందల్లా ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న వేళ ఎలక్షన్ రిజిస్ట్రీ ఆఫీసుకు తన ముఖ్య సలహాదారుతో కలిసి వెళ్ళడమే. నేరం రుజువైతే ఆయన 74 కొరడా దెబ్బలు తినడం గానీ, ఆర్నెల్ల జైలుశిక్ష గానీ అనుభవించాల్సి ఉంటుంది.