: ఊచకోత కోసిన గేల్, కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ పరుగుల పండగ చేసుకున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో గేల్ (77), కోహ్లీ (57) ఫిఫ్టీలు సాధించే క్రమంలో పంజాబ్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. ఈ జోడీ రెండో వికెట్ కు 14.2 ఓవర్లలో 136 పరుగులు జతచేయడంతో.. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు సాధించింది.