అనంతపురంలో రెండుగా చీలిన టీడీపీ.. రోడ్డుపైనే కొట్టుకున్న ఇరువర్గాలు!
- పల్లె రఘునాథరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం ఆందోళన
- ఘటనాస్థలికి చేరుకున్న పల్లె అనుచరులు
- రోడ్డుపైనే దాడిచేసుకున్న ఇరువర్గాలు
ఈ విషయం తెలుసుకున్న పల్లె రఘునాథరెడ్డి వర్గీయులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. అయితే ఇందుకు ఇరువర్గాలు అంగీకరించకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.