సిద్ధిపేటలో బావిలో పడ్డ కారు... వైజాగ్ వాసులకు తీవ్ర గాయాలు!
- ఈ తెల్లవారుజామున ఘటన
- అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు
- గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
విశాఖ జిల్లాకు చెందిన కొందరు ఓ శుభకార్యం నిమిత్తం సిద్దిపేటకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. తాను వేగంగా నడుపుతున్న కారును డ్రైవర్ నియంత్రించలేక పోయాడని, దీంతో రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో అది పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.