మహేశ్ .. అనిల్ రావిపూడి సినిమాలో సాయిపల్లవి?
- కథానాయికగా సాయిపల్లవికి మంచి క్రేజ్
- మహేశ్ సినిమా కోసం సంప్రదింపులు
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చేస్తున్నాడు. తన 26వ సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక కథానాయికగా సాయిపల్లవిని తీసుకోవాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లైన్ ఆమెకి వినిపించడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. అలాగే సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఎంచుకున్నారని, ఆయనను కూడా కలిసి లైన్ చెప్పేసి వస్తాడని అంటున్నారు.