: టీఆర్ఎస్ లో చేరికకు కడియం ముహూర్తం ఖరారు
తెలుగుదేశం పార్టీని వీడిన సీనియర్ నేత కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన కడియం ఈ విషయం వెల్లడించారు. పార్టీ మారినంత మాత్రాన రాజకీయ వ్యభిచారులు కాబోరని స్పష్టం చేశారు. టీడీపీ నేతలకు ఈ సందర్భంగా హితవు ఆయన పలికారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.