sruthihaasan: నాకు ఇష్టమైన హీరో ఆయనే: హీరోయిన్ శ్రుతి హాసన్

  • నాజూకు కథానాయికగా మంచి క్రేజ్ 
  • నాన్న సినిమా 'మహానది' ఇష్టం
  •  అజిత్ సంప్రదాయబద్ధమైన హీరో

తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ వుంది. హిందీ సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టిన ఆమెకి అక్కడ నిరాశే ఎదురైంది. ఆ తరువాత కెరియర్ పై దృష్టి పెట్టని కారణంగా ఆమెకి ఈ మూడు భాషల్లోను అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవలే మళ్లీ కెరియర్ పై దృష్టి పెడుతున్నట్టుగా ఆమె చెప్పింది.

తాజాగా 'వేలూరు'లోని ఒక కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో శ్రుతి హాసన్ పాల్గొంది. ఇంతవరకూ మీరు చూసిన సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు ఎక్కువ ఇష్టం? మీరు కలిసి నటించిన హీరోల్లో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం? అంటూ కళాశాల విద్యార్థులు ప్రశ్నించారు. అందుకు శ్రుతి హాసన్ స్పందిస్తూ .." మా నాన్నగారు నటించిన 'మహానది' నాకు బాగా నచ్చిన సినిమా. ఇక నేను నటించిన హీరోల్లో అజిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సంప్రదాయబద్ధమైన హీరోగా ఆయనను చెప్పుకోవచ్చు" అంటూ సమాధానమిచ్చింది.

  • Loading...

More Telugu News