పొలంలోని కంచెకు చిక్కుకుని విలవిల్లాడిన చిరుత
- పెనుకొండ మండలంలో ఘటన
- అధికారులకు సమాచారం అందించిన రైతు
- బంధించి తిరుపతి జూకు తరలించిన అధికారులు
చిరుతను చూసిన రైతు వెంటనే గ్రామస్థులకు, అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి పెనుకొండ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దాని వయసు ఏడాది ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం దానిని తిరుపతి జూకు తరలించినట్టు చెప్పారు.