అప్పు చేస్తే తప్పేంటని సిగ్గులేకుండా చెబుతున్న ఇలాంటి సీఎంను ఎవరినైనా చూశామా?: కేసీఆర్పై పొన్నం ఫైర్
- రాష్ట్ర విభజన నాటికి అప్పు రూ.60 వేల కోట్లు
- టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని రూ.2 లక్షల కోట్లు చేసింది
- పుట్టిన ప్రతి బిడ్డపై రూ.లక్ష అప్పు
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై లక్ష రూపాయల అప్పు ఉండే విధంగా ప్రభుత్వం వ్యవహారం నడుపుతోందని పొన్నం విమర్శించారు. ముఖ్యమంత్రికి ఆర్థిక క్రమశిక్షణ లేదని మండిపడ్డారు. ఈసారి కూడా మనం కేసీఆర్కు అధికారమిచ్చామని.. దానికి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే కాలంలో తెలంగాణను కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందనే ధైర్యంతో ముందుకు పోదామన్నారు.