అణు బాంబుల దిశగా పాక్ చూపు.. జాతీయ కమాండ్ అథారిటీ భేటీకి ఇమ్రాన్ ఖాన్ పిలుపు!
- బాలాకోట్ లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడి
- ఎన్సీఏ సమావేశం నిర్వహించాలని ఇమ్రాన్ నిర్ణయం
- పార్లమెంటు ఉభయ సభల సమావేశానికి పిలుపు
మరోవైపు ఈ విషయమై పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషీ మాట్లాడుతూ.. పుల్వామా దాడి తర్వాత భారత్ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. కశ్మీర్లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాల దృష్టి మరల్చడానికే భారత్ ఈ చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఆత్మరక్షణలో భాగంగానే పాకిస్థాన్ భారత్ దాడులను తిప్పికొడుతోందన్నారు. బాలాకోట్ లో భారత వైమానిక దళం నిన్న చేసిన దాడిలో 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.