: ఈసెట్ కు 78 పరీక్షా కేంద్రాలు
ఈ నెల 20 న జరుగనున్న ఈసెట్ పరీక్షకు (ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలలోకి డిప్లొమా హోల్డర్లకు ప్రవేశ పరీక్ష) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 45 వేల 291 మంది రాయనున్న ఈ పరీక్షకు 12 రీజనల్ సెంటర్లలో 78 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసారు. పరీక్షకు ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదంటూ విద్యార్థులకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, అన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తుపైనున్న ఫోటోపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పని సరిగా పెట్టించుకోవాలని సూచించారు.