పెనుబల్లిలోని సీడ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురి మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- బాయిలర్‌కు మరమ్మతు చేస్తుండగా పేలుడు
- కుప్పకూలిన మూడు గదులు
- శిథిలాల కింద చిక్కుకుని నలుగురి మృతి
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే పెనుబల్లిలోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా, చనిపోయిన వారిలో ఒకరు పెనుబల్లి మండలంలోని కొత్తకారాయి గూడేనికి చెందిన కర్రి రవి కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంతోష్ యాదవ్‌గా గుర్తించారు.
కారాయిగూడేనికే చెందిన మొగిలిపువ్వు కృష్ణ చైతన్య, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముకేశ్ యాదవ్ జాడ కనిపించకపోవడంతో మృతి చెందిన మరో ఇద్దరు వారే అయి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.