పద్మారావు గారు అందరూ మెచ్చేలా సభ నడుపుతారని ఆశిస్తున్నా: భట్టివిక్రమార్క
- డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక సందర్భంగా వ్యాఖ్య
- పార్టీలకతీతంగా ఎన్నుకోవడాన్ని గుర్తుచేసిన సీఎల్పీ నేత
- మీ నిర్ణయాలు అందరి ఆమోదం పొందాలి
సభా సంప్రదాయాల్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే క్రమంలో మీ ఎన్నిక ద్వారా సభ తన వివేచనను తెలియజేసిందని, మీ నిర్ణయాలతో దాన్ని మీరు కొనసాగించాలని కోరారు. స్పీకర్ లేదా మీరు ఎవరు ఆ స్థానంలో కూర్చున్నా మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేదప్రజల కోసం పనిచేశారని, మీ ప్రాంత ప్రజలకోసం మీరు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ సభ్యుల హక్కుల్ని కాపాడాలని కోరుతున్నానన్నారు.