టీడీపీలో చేరిన కిశోర్ చంద్రదేవ్.. అభ్యంతరం లేదంటూనే డుమ్మా కొట్టిన అశోక్ గజపతిరాజు!
- గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చంద్రదేవ్
- ఐదు సార్లు లోక్ సభ, ఓసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం
- హాజరుకాని సీనియర్ నేత అశోక్ గజపతి రాజు
యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, చంద్రదేవ్ టీడీపీలో చేరడంపై కేంద్ర మాజీ మంత్రి, అశోక్ గజపతి రాజు అయిష్టత వ్యక్తం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే చంద్రదేవ్ టీడీపీలో చేరితే స్వాగతిస్తానని, ఆయన చేరికపై ఎలాంటి అభ్యంతరం లేదని అశోక్ గజపతిరాజు చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా ఉండవల్లిలో చేరిన ఈ కార్యక్రమానికి అశోక్ గజపతి రాజు గైర్హాజరు కావడంతో మళ్లీ రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.