: గెలిస్తే నిలుస్తారు..
ఐపీఎల్ పోరు రసకందాయంలో పడింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్.. ముంబయి ఇండియన్స్ చేతిలో పరాజయం పాలవడం.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో కొనసాగుతున్న బెంగళూరు, హైదరాబాద్ జట్లకు చెరో రెండు మ్యాచ్ లు మిగిలున్నాయి. ఈ రెండు లీగ్ మ్యాచ్ లలో ఏ ఒక్కటి ఓడినా ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనన్న నేపథ్యంలో.. ఈరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో కీలక పోరుకు సిద్ధం అయింది. స్వంతగడ్డ బెంగళూరులో ఆడనుండడం రాయల్ చాలెంజర్స్ కు కలిసొచ్చే అంశం. ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.