Andhra Pradesh: కేఏ పాల్ పై సంచలన ఆరోపణలు చేసిన యాంకర్ శ్వేతారెడ్డి
- మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు
- హిందూపురం సీటుకు డబ్బులు డిమాండ్ చేశాడు
- శ్వేతారెడ్డి మండిపాటు
ప్రజాశాంతి పార్టీతో ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్న కేఏ పాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఆ పార్టీలో చేరి, కొన్నిరోజులకే దూరం జరిగిన టీవీ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేఏ పాల్ ఓ కామాంధుడని, అమ్మాయిలపై చేతులేసి తాకరాని చోట తాకుతుంటాడని అన్నారు. అనంతపురం పర్యటనలో తనతో ఓసారి ఇలాగే బిహేవ్ చేస్తే గట్టిగా హెచ్చరించానని వెల్లడించారు. అప్పట్నించి తనజోలికి రాలేదని, కానీ ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. తనకు హిందూపురం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ డబ్బులిస్తేనే టికెట్ అంటూ మెలిక పెట్టారని వాపోయారు శ్వేతారెడ్డి.
అటు, శ్వేతారెడ్డి ఆరోపణలకు కేఏ పాల్ కూడా అదేస్థాయిలో స్పందించారు. శ్వేతకు చాలామందితో సంబంధాలున్నాయని, ఆమె క్యారక్టర్ బాగాలేదని మొదట్లోనే గుర్తించామని అన్నారు. ఈ కారణంగానే తాము హిందూపురం టికెట్ ఇవ్వబోవడం లేదని చెబితే తమపైనే ఆరోపణలు చేస్తోందని చెప్పారు. నిన్నమొన్నటి దాకా నందమూరి బాలకృష్ణపై హిందూపురంలో మహిళా యాంకర్ పోటీ అంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. అంతలోనే కేఏ పాల్, యాంకర్ శ్వేతారెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది