kethineni: లక్ష్మీపార్వతి పాత్రకి శ్రీరెడ్డినే అనుకున్నాము!: 'లక్ష్మీస్ వీరగ్రంథం' దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

  • శ్రీరెడ్డికి కథ మాత్రమే చెప్పాను
  •  సీన్స్ విన్నాక అభ్యంతరం చెప్పొచ్చేమో
  •  ప్రస్తుతానికైతే తనే ప్రధాన పాత్రధారి     

ఒక వైపున రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టైటిల్ తో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. మరో వైపున 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రకిగాను నూటికి నూరు శాతం శ్రీరెడ్డినే అనుకున్నాము. శ్రీరెడ్డికి కథ చెప్పినప్పుడు చేయడానికి ఆమె అంగీకరించింది .. ఇంకా సీన్స్ గా చెప్పలేదు. సీన్స్ గా చెప్పినప్పుడు ఆమెకి ఏమైనా అభ్యంతరం వుంటే అప్పుడు ఆలోచిస్తాను .. ప్రస్తుతానికైతే ఆమెనే ప్రధాన పాత్రధారి. ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి గనుక శ్రీరెడ్డి అభ్యంతరం చెప్పొచ్చు. వీరగంధం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి .. అక్కడి నుంచి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం .. ఆ తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి ఈ సినిమా ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News