adharvamurali: మెగా హీరోతో పాటు రంగంలోకి తమిళ హీరో?
- తెలుగులోకి 'జిగర్తాండ' రీమేక్
- టైటిల్ గా 'వాల్మీకి'
- అధర్వ మురళితో సంప్రదింపులు
తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న 'జిగర్తాండ' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దర్శకుడు హరీశ్ శంకర్ రంగంలోకి దిగాడు. పూర్తి వినోదభరితంగా సాగే మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్న హరీశ్ శంకర్, 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.
ఇక మరో కథానాయకుడి పాత్రను ఎవరితో చేయించాలా అనే ఆలోచనలో వున్నాడు. ఈ నేపథ్యంలోనే నాగశౌర్య .. శ్రీవిష్ణు పేర్లు వినిపించాయి. తాజాగా తమిళ హీరో 'అథర్వ మురళి'తో హరీశ్ శంకర్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తెలుగు .. తమిళ భాషల్లో ఘన విజయాన్ని సాధించిన 'హృదయం' హీరో మురళి తనయుడే అధర్వ మురళి. తమిళంలో హీరోగా నిలదొక్కుకున్న ఈ హీరో ఈ సినిమా ఒప్పుకుంటే, తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యే అవకాశాలు వున్నాయి.