: జేఏసీ విఫలమైంది: దిలీప్ కుమార్
టీఆర్ఎస్ లో చేరేవారంతా తెలంగాణ వాదులు కాదంటూ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వాదులను ఏకతాటిపైకి తీసుకురావడంలో టీజేఎసీ విఫలమైందన్న దిలీప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గతంలో తెలంగాణకు ద్రోహం చేసారని విమర్శించారు. ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా తెలంగాణకు ప్రయోజనం లేదన్నారు. జేఎసీ తరపున అభ్యర్థులను ప్రకటించాలని, అప్పుడే తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు.