టీడీపీ నేతల ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు.. దుమ్మెత్తి పోసిన విజయసాయిరెడ్డి!
- టీడీపీ-బీజేపీది ప్రైవేటు ప్రేమాయణం
- అనైతిక సంబంధానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
- ట్విట్టర్ లో మండిపడ్డ వైసీపీ సీనియర్ నేత
విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్ అంటూనే బాబు &కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టయింది.
ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి?’ అని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా తన ట్వీట్ కు విజయసాయిరెడ్డి జత చేశారు.