జనసేనలోకి తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ నాయుడు.. కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్!
- విజయవాడ పార్టీ కార్యాలయంలో జనసేన తీర్థం
- కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పవన్
- రాజకీయ సలహాదారు పదవి ఇచ్చిన జనసేనాని
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రామ్మోహన్ రావు గారు జనసేనలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన్ను తన రాజకీయ సలహాదారుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. రామ్మోహన్ రావుకు పబ్లిక్ పాలసీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందనీ, జయలలిత ఆసుపత్రిలో ఉండగా, రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని నడిపారని పేర్కొన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి జనసేనలో చేరినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.