: జగన్ కు కోర్టులో ఊరట
అక్రమాస్తుల కేసులో మొదటి సారిగా వైఎస్ జగన్మోహనరెడ్డిపై సిబిఐ మోపిన నేరాభియోగాలను కోర్టు కొట్టేసింది. దాల్మియా సిమెంట్స్ కు చేసిన భూ కేటాయింపులు, ఫలితంగా ఆ సంస్థ జగతి పబ్లికేషన్స్ లో పెట్టిన పెట్టుబడులపై సీబీఐ కోర్టులో 5వ చార్జిషీటును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని పరిశీలించిన కోర్టు జగన్, విజయసాయిపై 409, పిసి యాక్ట్ 12 కింద మోపిన అభియోగాలను పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ నమ్మకద్రోహానికి పాల్పడినట్లు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.