Andhra Pradesh: శాసనసభకు రాకపోతే జీతాలు ఇవ్వరా? ఏదైనా చట్టం ఉందా?: కోడెలపై అంబటి ఫైర్

  • ఇలాంటి సంప్రదాయం ఏమైనా ఉందా?
  • శాసనసభ్యుడికి చాలా బాధ్యతలు ఉంటాయి
  • శాసనసభకు వచ్చి కూర్చోవడమే బాధ్యత కాదు

శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు రావట్లేదు కానీ, జీతాలు మాత్రం తీసుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాసనసభకు హాజరుకాని ఎమ్మెల్యేలు జీతం తీసుకోకూడదన్న సంప్రదాయం ఏమైనా ఉందా? లేకపోతే ఏదైనా చట్టం ఉందా? అని ప్రశ్నించారు. శాసనసభ్యుడికి చాలా బాధ్యతలు ఉంటాయని, శాసనసభకు వచ్చి కూర్చోవడం మాత్రమే బాధ్యత కాదన్న విషయాన్ని గమనించాలని అన్నారు. స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వాదులు తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు.

ఈ ఐదేళ్లలో ఐదు గంటలైనా ఉపసభాపతి కుర్చీలో కూర్చున్నారా?

శాసనసభకు సభాపతితో పాటు ఉపసభాపతి కూడా ఉన్నారని, ఈ ఐదేళ్లలో కనీసం ఐదు గంటలైనా ఉపసభాపతి చైర్ లో కూర్చున్నారా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు మాటను ఉపసభాపతి వినరేమోనన్న భయం ఏమైనా ఉందేమో, అందుకే, ఆయనకు అవకాశమివ్వలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గంగా శాసనసభను నిర్వహించిన ఘనత స్పీకర్, ప్రభుత్వానిది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News