లోక్ సభలో తీవ్ర ఉద్వేగానికి గురైన దేవెగౌడ
- లోక్ సభలో నిన్న ఉద్వేగభరిత సన్నివేశం
- సభలో ఇదే నా చివరి ప్రసంగం అంటూ ఉద్వేగానికి గురైన దేవెగౌడ
- 57 ఏళ్లు ప్రజల కోసమే జీవించానన్న మాజీ ప్రధాని
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయాన్ని నిలిపివేసిన సమయంలో... దేశంలోని నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రభుత్వ పథకాలకు వినియోగించాలన్న ప్రతిపాదన తన హయాంలో చేసిందేనని దేవెగౌడ చెప్పారు. మహాకూటముల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు గందరగోళం సృష్టిస్తాయని, దానికి దేవెగౌడ ప్రభుత్వమే నిదర్శనమని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీల కూటములపై అనవసర వ్యాఖ్యలు వద్దని సూచించారు. వాజ్ పేయితోనే సంకీర్ణ ప్రభుత్వాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. పార్టీల మధ్య అవగాహన ఉంటే... సంకీర్ణ ప్రభుత్వాలు విజయవంతమవుతాయని చెప్పారు.