అఖిల్ నెక్స్ట్ మూవీకి నిర్మాత నాగ్ కాదట
- వరుస పరాజయాలతో అఖిల్
- తదుపరి సినిమా సత్య పినిశెట్టితో
- వేరే బ్యానర్లో చేసే అవకాశం
ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. అఖిల్ కి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే 'హలో' సినిమాను నాగార్జున నిర్మించారు. అయినా ఆ సినిమా ఆదరణ పొందలేదు. ఇప్పుడు మళ్లీ అఖిల్ సినిమాను సొంత బ్యానర్లో చేస్తే వేరే సంకేతాలు వెళతాయనే ఆలోచనలో నాగార్జున ఉన్నారట. అందువలన వేరే బ్యానర్లోనే అఖిల్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం వుంది.